జగన్ మీడ్ పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా నీరు గారి పోతున్నాయి. ఏకంగా ట్రిబ్యునల్ దర్యాప్తు సంస్థ మీది ఆగ్రహాన్ని ప్రదర్శించిదంటే అర్ధం చేసుకోవచ్చు. అసలు జగన్ కేసులో క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగిందో చెప్పాలంటూ అప్పీలేట్... ఈడీని ప్రశ్నించిందంటే... ఈ కేసుల దర్యాప్తు తీరు ఎలా సాగిందో ఇట్టే అర్థం కాక మానదు. రూ.7.5 కోట్ల ప్రయోజనం కోసం ఎవరైనా రూ.53 కోట్లు ఖర్చు చేస్తారా? అంటూ అప్పీలేట్ ప్రశ్నించిన తీరుతో ఈడీ అధికారుల నోట మాట రాలేదట.


అసలు జగన్ పై నమోదైన కేసుల అసలు ఉద్దేశ్యాన్ని పసిగట్టలేదంటే... ఈడీ అధికారులు అసలు ఈ కేసు విచారణపై మైండే పెట్టలేదని కూడా అర్థమవుతోందంటూ అప్పీలేట్ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మొత్తంగా జగన్ కేసుల్లో ఈడీ జప్తుల మీద జప్తులు చేస్తూ వెళ్లిన తీరును ఎండగట్టిన అప్పీలేట్... ఈ కేసుల్లో అసలు ఆధారాలెక్కడున్నాయని ప్రశ్నించడంతో ఈడీ అధికారుల మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. 


ఈ దిశగా సాగిన విచారణ తంతును ఓ సారి పరిశీలిస్తే... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడగట్టారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్థాయి నేత ఫ్రం అడ్రెస్ కూడా లేని లేఖ రాస్తే... ఆ లేఖపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఈ కేసులో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ కు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఐ అధికారుల దర్యాప్తు ఓ వైపు కొనసాగుతుండగానే... మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: