కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఎమ్మెల్యేలను రిసార్టులు తరలించి వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.  


జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ఎమ్మెల్యేల కోసం భారీ మొత్తంలో డబ్బులు కేటాయించింది.  ఒక్కో ఎమ్మెల్యేకు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని వినికిడి.  అంత మొత్తంలో ఎందుకు కేటాయిస్తున్నారని అంటే.. అంతే ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అంటే.. వారికి సకల సౌకర్యాలు అందించాలి.  


అందుకోసం డబ్బు ఖర్చు చేయాలి.  ఈనెల 17 వ తేదీన కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనబోతున్నది.  ఆ రోజు వరకు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  బలపరీక్ష రోజున ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా అసెంబ్లీకి తరలిస్తారట.  


ఇక అసమ్మతి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు హోటల్స్ లో ఉన్నారు.  వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.  కొంతమంది తిరిగి వెనక్కి వచ్చేందుకు అంగీకరిస్తున్నా.. కొందరు మాత్రం ససేమిరా అంటున్నారు.  ఏది ఏమైనా మరో రెండు మూడు రోజుల్లో అన్ని విషయాలు బయటకు రానున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: