సుజనా చౌదరి పేరు ముందు ఇప్పుడు వైస్ కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి ఏనాడూ... తన పేరును యలమంచిలి సుజనా చౌదరిగా పేర్కొన్న దాఖలా లేదు అయితే ఇప్పుడుఎ ఏమైందో తెలియదు గానీ... టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా విజయవాడ  వస్తున్న సందర్భంగా ఆయన తన పేరు ముంగిట వైఎస్ ట్యాగ్ ను తగిలించేసుకున్నారు.


ఆదివారం నాటి ప్రముఖ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో సుజనా.. తన పేరును వైఎస్ చౌదరిగానే పేర్కొన్నారు. అయితే వైఎస్ చౌదరి అంటే ఎక్కడ తనను గుర్తు పట్టరని అనుమానపడ్డారో ఏమో తెలియదు గానీ... తన పేరు కింద బ్రాకెట్ లో సుజనా చౌదరి అని రాయించుకున్నారు. వైఎస్ అంటే... వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీగానే అంతా భావిస్తారు. ఇక వైఎస్ అన్న పదం వినబడిందంటే...ఢిల్లీలోనూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డినే గుర్తుకు వస్తారు. 


ఇలాంటి నేపథ్యంలో సుజనా... తన పేరు ముంగిట వైఎస్ ట్యాగ్ ను తగిలించుకోవడం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేరెత్తిస్తోంది. గతంలో జగన్ ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటు లాబీల్లో జగన్ తో పాటు సుజనా కలిసిన వైనం వారిద్దరూ చాలా సేపు ముచ్చటించుకోవడం ఆసక్తి రేకెత్తించింది. నిత్యం కత్తులు దూసుకునే జగన్ సుజనాలు అలా కలిసి ఏకాంతంగా చర్చలు జరపడమేమిటా? అన్న అనుమానాలూ రేకెత్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: