జగన్మోహన్ రెడ్డి సూపర్ స్కెచ్ వేసేశారు. ఎంఎల్ఏలందరినీ ఒకేసారి ఫిక్స్ చేసేశారు. ఆ ఫిక్స్ చేయటంలో తన మన అన్న తేడా లేకుండా వైసిపి ప్లస్ టిడిపి ఎంఎల్ఏలందరినీ ఫిక్స్ చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే మంచినీటి సమస్య పరిష్కారినికి ప్రతీ ఎంఎల్ఏలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమిటంటే సకాలంలో వర్షాలు కురవలేదు. భూగర్భ జలాలు నానాటికి ఇంకిపోతున్నాయి. దాంతో మంచినీటికి కటకట ఎక్కువైపోయింది. ఇదే విషయమై సభలో టిడిపి ఎంఎల్ఏలు రచ్చ రచ్చ చేశారు. దాంతో మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రతీ ఎంఎల్ఏలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు జగన్ చెప్పారు.

 

ఎప్పుడైతే  జగన్ ప్రకటించారో వెంటనే టిడిపి ఎంఎల్ఏల నోళ్ళు మూతపడిపోయాయి. మంచినీటి సమస్యను బూచిగా చూపించి సభలోను బయట జగన్ ను గబ్బు పట్టిద్దామని టిడిపి ప్లాన్ చేసింది. దాన్ని ఊహించే నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రకటన చేశారు. అంటే ఇపుడు తమ నియోజకవర్గాల్లో మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంఎల్ఏలపైనే పడింది.

 

వైసిపి ఎంఎల్ఏలు ఎటూ మంచినీటి సమస్యపై సభలో మాట్లాడరు. టిడిపి ఎంఎల్ఏలు మాట్లాడేందుకు ఇంక ఏమీ లేదు.  కోటి రూపాయలు మంజూరు చేసిన తర్వాత కూడా మంచినీటి సమస్య ఉందంటే అది ఎంఎల్ఏల తప్పవుతుంది. కాబట్టి టిడిపి ఎంఎల్ఏలు ఎవరైనా నీటి సమస్య అంటూ మాట్లాడితే అంతే సంగతులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: