పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్. ఇపుడు జనసేనాని. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయాడు. ఇక పవన్ పార్టీ కూడా కేవలం ఏడు శాతం ఓట్లు తెచ్చుకుంది. పవన్ పార్టీ గెలిచిన ఒకే ఒక సీటు రాజోలు కూడా అక్కడ వర ప్రసాద్ కారణంగానేనని విశ్లేషిస్తున్న పరిస్థితి.


ఇదిలా ఉండగా ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ అక్కడ తాను కొన్నేళ్ళ క్రితం చెప్పిన ఓ భారీ సెంటిమెంట్ ప్రకటనను  అటూ ఇటూ మార్చి చెప్పారు. తాను ఏపీ ముక్కలైనందుకు బాధపడలేదని, ఏపీ, తెలంగాణా రెండింటిలో దేని వైపు ఉండాలో నాడు తేల్చుకోలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. ఇది  కొన్నేళ్ళ నాటి ప్రకటనకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ప్రత్యర్ధి పార్టీలు ఏకి పారేస్తున్నాయి.


పవన్ కొన్నేళ్ళ  క్రితం  చెప్పిన మాట ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినపుడు తాను పదకొండు రోజులు భోజనం మానేశాను అని. మరి ఈ సెంటిమెంట్ స్టేట్మెంట్ కే చాలామంది ఫిదా అయిపోయారు. ఆ తరువాతే పవన్ రాజకీయంగా గుర్తింపు ఎక్కువగా తెచ్చుకున్నారు. ఇక ఇపుడు పవన్ అలా మాట మార్చడం వెనక కారణం ఏమైనా  ఉందా అంటే ఉందనే అంటున్నారు. 


విభజనకు మద్దతు ఇచ్చిన బీజేపీ వైపు పవన్ ఇపుడు మొగ్గు చూపుతున్నాడని టాక్. దాంతోనే పవన్ స్టేట్మెంట్ మారిందని అంటున్నారు. మరి ఇలా మాట మార్చడం, లేక అబద్దం చెప్పడంపై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. టీవీ డిబేట్లలో కూడా వారు సరైన సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. మరి పవన్ ఇలా తన ఫ్యాన్స్ ని డిఫెన్స్ లో   పడేయడం  న్యాయమా.....


మరింత సమాచారం తెలుసుకోండి: