కర్ణాటకలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగున్నాయి.  ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధంగా తలలు పట్టుకుంటున్నారు.  సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదు ఆనుకుంటు పాలన సాగిస్తున్న సమయంలో హఠాత్తుగా పదిమంది సభ్యులు రాజీనామాలు చేయడంతో అమెరికాలో ఉన్న కుమారస్వామి తిరిగి ఇండియా వచ్చారు. 

ఇండియా వచ్చిన తరువాత రెబల్ నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.  దారిలోకి వస్తున్నారు అనుకునే లోపే.. మరో ఐదుగురు రాజీనామాలు చేయడంతో తలనొప్పులు వచ్చాయి.  కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అనుకున్నారు.  


మంత్రి శివకుమార్ నేతృత్వంలో సభ్యులను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించడం లేదు.  ఈనెల 17 వ తేదీన కుమారస్వామి బలనిరూపణ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.  దీంతో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి.  


దీనికోసం ఆయా పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.  రెబల్ అభ్యర్థులు దారికి రాకపోవడంతో.. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తప్పా మరో మార్గం లేదు.  ఒకవేళ అదే జరిగితే.. కర్ణాటకలో తిరిగి కమలం వికసిస్తుంది.  ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: