చంద్రబాబునాయుడు జైలు జీవితంపై కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సుజనా అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. గడచిన పదేళ్ళల్లో టిడిపిలో సుజనా ఎంతటి కీలక పాత్ర పోషించారో అందరూ చూసిందే. అందుకే చంద్రబాబుకున్న బినామీల్లో సుజనా కూడా ఒకరని ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నేతలు పార్టీ మారిపోతున్నారు. అందుకే నలుగురు రాజ్యసభ ఎంపిలు కూడా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించారు. ఈ నేపధ్యంలోనే సుజనా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని చెప్పలేరట కానీ  పరిపాలన గాడి తప్పిన మాట వాస్తవమన్నారు.  

 

అవినీతి ఆరోపణలపై నిజాయితీగా విచారణ జరిపిస్తే చంద్రబాబుకు శిక్ష పడే విషయాన్ని చెప్పలేనంటూ తెలివిగా తప్పించుకున్నారు. చంద్రబాబు హయాంలో అడ్డదిడ్డమైన అవినీతి జరిగిందన్నది వాస్తవం. అన్నీ వ్యవస్ధలను చంద్రబాబు భ్రష్టుపట్టించారు. ఇసుక, మట్టి, నీళ్ళు సమస్తం దోచేసుకున్నారు. ఏ పథకం చూసినా అవినీతి కంపే. అందుకే ఇపుడు జగన్ అనేక కాంట్రాక్టులపై విచారణ జరిపిస్తున్నారు.

 

ప్రాధమికంగా విచారణ జరుపుగుతున్న కమిటిలు గనుక అవినీతి జరిగిందని తేలితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. పైగా చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురూతైతే తప్పించేందుకే సుజనాను ముందుగా బిజెపిలోకి పంపారనే ప్రచారం కూడా జరుగుతోంది.

 

 

 

మొన్నటి వరకూ చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితునిగా ఉండి పార్టీ ఫిరాయించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: