నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు నువ్వా నేనా అంటూ ట్విట్స్ చేసుకున్నరు కేశినేని నాని, బుద్ధా వెంకన్న. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ చేసుకున్న ఈ ట్విట్ల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఒకే పార్టీ నేతలు ఇలాంటి ట్విట్లు చేసుకున్నందుకు వారికే నష్టం. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవడం అది కూడా సోషల్ మీడియాలో చెయ్యడం వల్ల వారి పార్టీకే పరువు నష్టం. 


నాలుగు పదాలు చదివేకి రాని వాడు ట్విట్లు చేస్తున్నాడు అంటూ ట్విట్ యుద్దాన్ని ప్రారంభించాడు కేశినేని నాని, అందరూ అనుకున్నారు ఆ ట్విట్ నారా లోకేష్ కే కేశినేని నాని అంకితం ఇచ్చారు అని, కానీ ఆ ట్విట్ నాకోసం అంటూ బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యి ఆదివారమంతా ట్విట్టర్ యుద్ధం చేసుకున్నరు ఒకే పార్టీ నేతలు. 


దీంతో విరక్తి చెందిన బుద్ధా వెంకన్న ట్విట్ యుద్ధాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈరోజు ఉదయం మొదటి పోస్ట్ ట్విట్ యుద్దాన్ని ఆపేయాలనుకుంటున్న అని పోస్ట్ చేసారు. ఆ ట్విట్ లో ఇలా రాశారు 'బలహీన వర్గాలకి చెందిన నాకు ఎం ఎల్ సి పదవి ఇచ్చిన చంద్రబాబు గారికీ విశ్వాస పాత్రుడిని దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే... చంద్రబాబు గారీ కొసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్దం ఆపేస్తున్నాను' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్విట్ కు నెటిజన్లు మీరు ఆపకండి మాకు ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటూ పోస్ట్ చేస్తున్నారు. కాగా ఈ ట్విట్ కు కేశినేని నాని స్పందించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: