తన మీద ఉన్న కేసులకు భయపడిపోయి బీజేపీలోకి చేరిన టీడీపీ మాజీ ముఖ్య నేత సుజనా చౌదరి. ఈయన గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాతలు కూడా రాయలేని పరిస్థితి.  తెలుగుదేశం పార్టీ నుంచి అధికారం చేజారిన నేపథ్యంలో కేసులు, అప్పుల బొక్కలు పూడ్చుకునేందుకు కొంతమంది నేతలు బీజేపీలో చేరారు, చేరుతున్నారు. ఆ చేరికలతో బీజేపీ బలోపేతం కావడం అటుంచి, అభాసుపాలవుతూ ఉంది.


అలాంటి వారిని ఏరికోరి చేర్చుకుంటోంది భారతీయ జనతాపార్టీ. ఇలాంటి నేపథ్యంలో నవ్వులపాలు అవుతున్నది చాలదన్నట్టుగా చేరినవారు తమ తమ స్టేట్ మెంట్స్ తో మరింత కామెడీ చేస్తూ ఉన్నారు. ఒకరేమో తను రాయలసీమ అభివృద్ధి కోసం బీజేపీలోకి ఫిరాయించినట్టుగా ప్రకటించుకున్నారు. వ్యాపారాల కోసం చేసిన అప్పులను ఆయన కూడా ఎగ్గొట్టే స్థితిలోకి వచ్చారని, ఆయన అప్పుల చిట్టా పెరిగిపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో టీడీపీ కూడా అధికారం కోల్పోయిందని, దీనికే ఆయన ఫిరాయించాడనే ప్రచారం జరుగుతూ ఉంది.


అయితే ఆయనేమో తన ఫిరాయింపుతో సీమను ఉద్ధరించబోతున్నట్టుగా ప్రకటించుకున్నారు. ఇలాంటి నేతలను అక్కడి జనాలు ఎలా తిడుతున్నారో రాతల్లో రాయలేం! ఇక సుజనా చౌదరి తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి, భారతీయ జనతా పార్టీని ఒక రేంజ్ కు తీసుకెళ్లబోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఇంత తోపు, తురుము.. ఇన్నేళ్లూ ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి సత్తా చూపలేదబ్బా.. అని తెలుగుదేశం వాళ్లు కూడా అనుకుంటున్నారట. ఏదేమైనా తన సత్తా అంతా బీజేపీ కోసమే చూపిస్తారట సుజనాచౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: