2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. క్యాబినేట్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతి చేసినట్లు తేలితే చర్యలు ఉంటాయని ఇప్పటికే ఆదేశించారు. గత ప్రభుత్వమైన తెలుగుదేశం పాలనలో అవినీతి గురించి తేల్చడానికి సబ్ కమిటీ కూడా వేసారు. గత ప్రభుత్వంలో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ళలో ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని పీపీఏలు రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డిగారు భావించారు.

 

కానీ ఈ విషయంపై కేంద్రం నుండి జగన్మోహన్ రెడ్డిగారికి రెండుసార్లు లేఖలు వచ్చాయి. విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందం రద్దు చేస్తే విదేశీ పెట్టబడులు తగ్గిపోయే అవకాశం ఉందని అవినీతి జరిగినట్లు బలమైన సాక్ష్యాలున్న సమయంలోనే ఒప్పందాలు రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ధరలతో కూడిన ఒక ఛార్ట్ కూడా కేంద్రం లేఖతో పాటు జగన్మోహన్ రెడ్డిగారికి పంపారు. 

 

ఈ చార్ట్ లోని  ధరలు చూసి ఈ విషయంపై ఆలోచించాలని లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పటికే కేంద్రం రెండు సార్లు జగన్మోహన్ రెడ్డిగారికి విద్యుత్ ఒప్పందాల విషయంలో లేఖలు పంపింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఆచితూచి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజంగా అవినీతి జరిగినట్లు బలమైన సాక్ష్యాధారాలు దొరికితే మాత్రం ఒప్పందాలు రద్దు చేసినా ఎటువంటి సమస్య ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: