-కొత్తూరు సీహెచ్ సీ స్థాయి పెంచేందుకు నిర్ణయం..

-రిమ్స్ తరువాత జిల్లాలో ఇక్కడే అత్యున్నత వైద్యం..

అందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉదేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నెలకొల్పనుంది. ఇందుకోసం కొత్తూరు ప్రభుత్వ సామజిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ఆసుపత్రి స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించి అందరికీ మెరుగైన  వైద్యాన్ని అందించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామికి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనులు అవగాహన రహిత్యంతో నాటు వైద్యులను  ఆశ్రయిస్తారు. వారిని ఒప్పించి ఆస్పత్రులకు తీసుకువచ్చినా ఉన్నత వైద్యం అందుబాటులో ఉండకపోవడంతో వెనక్క వెల్లిపోతన్నారు.

దూర ప్రాంతాలకు వెల్లి వైద్యం చేయించుకునేందుకు వారు అంగీకరించడంలేదు. అందుచేత వారి చెంతనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో పాతపట్టణం నియోజకవర్గం పరిధీలోని కొత్తూరు ప్రభుత్వ సామజిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనుంది.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో సూపర్  స్పెసాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్రైబల్ వెల్ ఫేర్ ఇంజనీర్ అధికారులు రంగంలోకి దిగారు.

కొత్తూరు సీహెచ్ సీ హాస్పిటల్ ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం కొత్తూరుకు స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఇక్కడ ఆసుపత్రి నెలకొల్పితే సీతంపేట, భామిని, హిమమండలం, పాతపట్నం, ఎల్ ఎం పేట, మేళియపుట్టి మండలాల వాసులకు అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం , విజయనగరం గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయడం వల్ల విజయనగరం జిల్లాలోని గిరిజనులకు కూడా ఈ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: