ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ఇంటర్ విద్యార్ధుల మధ్యాహ్న భోజనం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై సంచలన ట్విట్ చేశారు. ప్రతిపక్ష పార్టీ చేసే ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేతలకు దిమ్మతిరిగేల ఎప్పటికప్పుడు సమాధానం చెప్తుంటారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటర్ విద్యార్ధుల మధ్యాహ్న భోజనం ఎత్తివేత ఆరోపణలపై విజయసాయి రెడ్డి సమాధానం ఇచ్చారు. 


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వారం ట్విట్టర్ లో ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం పై స్పందిస్తూ 'వైఎస్ జగన్ గారు వచ్చారో లేదో అప్పుడే మధ్యాహ్న భోజనం పథకం ఎత్తివేశారు అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ నారా లోకేష్ కూడా చేసారు. ఈ ట్విట్ కు స్పందించిన విజయ్ సాయి రెడ్డి ఇలా రాసారు.     


విజయ్ సాయి రెడ్డి ట్విట్ ఇలా రాసారు '2 వేల కంటే 15 వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి. కాదంటే ధర్నాలు చేయిస్తారట. ఎన్నికల ముందు ఇంటర్ విద్యార్ధులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్నభోజనం ఏడాది ఖర్చు 2 వేలు. విద్యార్ధులను ఆర్థికంగా ఆదుకునేందుకు భోజనానికి బదులుగా ఏటా 15 వేలు ఇస్తామని జగన్ గారు చెబితే దారుణం అంటున్నారు బాబు'. అంటూ ట్విట్ చేసారు. ఈ ట్విట్ కు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: