2019 సంవత్సరం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేదు. 175 సీట్లలో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. ఇంత ఘోర పరాజయం తరువాత టీడీపీ పార్టీ నుండి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. మరికొంతమంది నేతలు కూడా తెలుగుదేశం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతున్న టీడీపీ పార్టీకి సొంత పార్టీలోనే ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి.

 

నిన్నటినుండి ఇద్దరు టీడీపీ నేతలు ట్విట్టర్ ద్వారా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఎంపీ కేశినేని నాని బుధ్ధా వెంకన్నను ఉద్దేశించి "నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు ఇది మన దౌర్భాగ్యం " అని విమర్శిస్తే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కేశినేని నానిని ఉద్దేశించి "సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుని కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అని ట్వీట్ చేసాడు.

 

సొంత పార్టీలోనే ఇద్దరు నాయకులు ఇలా బహిరంగంగా ట్విట్టర్ ద్వారా విమర్శించుకోవడం వలన టీడీపీ పార్టీ ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలో ఇలాంటివి జరగకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంది. చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి విమర్శల వలన పార్టీ పరువు ఖచ్చితంగా పోతుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: