ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డిపై గతంలో పెట్టిన కేసులన్నీ కేవలం రాజకీయంగా కక్షసాధింపు కేసులే అని తేలిపోతోంది. జగన్ కేసుల విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుపై అప్పీలేట్ అథారిటీ తాజాగా అక్షింతలు వేయటంతో ఆ విషయం అందరికీ అర్ధమైపోతోంది.

 

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేయటంతోనే కాంగ్రెస్, టిడిపిలు జాయింట్ గా కలిసే జగన్ పై కుట్ర చేసినట్లు గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి.  ఇప్పటి వరకూ జగన్ పై విచారణ జరిగిన  ఏ కేసులో కూడా సిబిఐ, ఈడి, ఐటి కానీ ఒక్క కేసులో కూడా ఆధారాలను చూపలేకపోయాయి. దాంతో ఒక్కో కేసు విచారణలో వీగిపోతున్నాయి.

 

జగన్ కేసులో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది క్విడ్ ప్రో కో వ్యవహారం. ఇదే విషయాన్ని అప్పీలేట్ అథారిటి ఈడి అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జగన్ తో పాటు అనేకమంది ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీకి భూముల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘన జరగలేదని అప్పీలేట్ అథారిటి వ్యాఖ్యానించింది.

 

విచారణలో భాగంగా జప్తు చేసిన ఆస్తులను తిరిగి సదరు సంస్ధలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఒక్క పెన్నా సిమెంట్స్ విషయంలోనే కాకుండా ఇతర కేసుల విషయంలో కూడా జప్తుచేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని చేసిన ఆదేశాలతోనే కేసులు రాజకీయంగా కక్షసాధింపుతో పెట్టినవే అని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: