చంద్రబాబునాయుడు గాలి తీసేసింది కియా మోటారు సంస్ధ. ధక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల తయారీ సంస్ధ అనంతపురంలో ఉత్పత్తి ప్లాంట్ పెట్టిన విషయం తెలిసిందే. దాన్ని తన ఘనతగా చంద్రబాబు డప్పేసి ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అదే సమయంలో నరేంద్రమోడి వల్లే కియా ఏపిలో ప్లాంట్ పెట్టిందని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. ఇపుడు వీరిద్దరికీ కియా సంస్ధ తాజాగా షాక్ ఇచ్చింది.

 

జగన్మోహన్ రెడ్డికి కియా మోటారు సంస్ధ యాజమాన్యం లేఖరాస్తూ 2007లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకే అనంతపురంలో కియా ప్లాంటు పెట్టినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్రంలో కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు పెట్టాలని కోరుతు తమకు 2007లోనే వైఎస్ లేఖ రాసిన విషయాన్ని ఇపుడు బయటపెట్టింది.

 

అంటే కియా యాజమాన్యం జగన్ కు రాసిన తాజా లేఖ ద్వారా అసలు కార్లు ఉత్పత్తి ప్లాంట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వల్లే రాష్ట్రానికి వచ్చిందని అనుకోవాలి. మరి కియా-ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఐదేళ్ళల్లో చంద్రబాబుకు కనబడలేదా ? లేకపోతే జగన్ సిఎం అయిన తర్వాతే కియా యాజమాన్యం కావాలనే లేఖను బయటపెట్టిందా ? అన్నది తేలలేదు.

 

ఏమైనా ఇంతకాలం తన ఘనత వల్లే కియా సంస్ధ అనంతపురంలో ప్లాంటు పెట్టిందని చంద్రబాబు చెప్పుకునేందుకు లేకుండాపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకు తగ్గట్లుగానే వ్యాపారసంస్ధలు నడుచుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇందుకు కియా యాజమాన్యానికి కూడా మినహాయింపు లేదు. మొత్తానికి జగన్ కు రాసిన తాజా లేఖతో చంద్రబాబుకు కియా యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చినట్లైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: