2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కేవలం ముగ్గురు మాత్రమే ఎంపీలుగా గెలిచారు. ఆ ఎంపీలలో ఒకరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. నిన్నటి నుండి ట్విట్టర్లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై కేశినేని నాని విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కేశినేని నాని పార్టీ మారాలని నిర్ణయించుకున్న తరువాతే ఇలా విమర్శలు చేస్తున్నాడని అతి త్వరలోనే వైసీపీ పార్టీలో చేరాలని కేశినేని నాని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది.

 

నిన్నటినుండి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేశినేని నాని ట్విట్టర్ ద్వారా నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు దౌర్భాగ్యం అంటూ ట్వీట్ చేసాడు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకీ, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదని ట్వీటేశాడు కేశినేని నాని.

 

మరో ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీకు ఇష్టం లేకపోతే ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిధ్ధంగా ఉన్నాను అన్నాడు. వైసీపీ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు కానీ ఎవరైనా పదవికి రాజీనామా చేసి వస్తే మాత్రం పార్టీలోకి చేర్చుకోవడానికి సిధ్ధమే అని ఎప్పుడో ప్రకటించింది. మరి కేశినేని నాని టీడీపీ పార్టీలోనే కొనసాగుతాడో రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరతాడో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: