ఖరీఫ్ కాలం రోజులు తరిగిపోతున్నాయి. జులై వచ్చిందంటే ఊడుపులు ఊపందుకుంటాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండంతో అన్నదాతతలు ఆందోళన చెందుతున్నారు. ఎండలతో ఒకపక్క నారుమడులన్నీ ఎండిపోతున్నా.. మరోపక్క రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మండలంలోని నారుపోతలు పూర్తయినప్పటికీ వాటికీ తగ్గ నీరు లభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క సాగునీటి వనరులు కూడా అంతగా సహకరించడం లేదని ఇప్పటికే అన్ని మండలాల్లోని సుమారు 760 హెక్టార్లల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధ మయ్యామని రైతులు చెబుతున్నారు. చినుకు పడితే గాని సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. కొన్ని చోట్ల మోటర్లు పెట్టి వరినారు తడిపినప్పటికీ దాని వల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వనరులు పూర్తిగా దూరమయ్యాయని అన్నదాతతలా ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడకపోతాయా అన్న ఆశతో వరినాట్లు ఏపుగా వేసేశారు. ప్రధానంగా సింగుపురం, కరజాడ, బైరి , పొన్నాం, బట్టేరు, కిష్టప్పపేట, లంకాం,వాకలవలస తదితర ప్రాంతాల్లో నారు మడులు సిద్ధంగా ఉన్నాయి. అడపా దడపా పడిన వర్షాలకు గాను రైతుల కళ్ళలో ఆశలు చిగురించినప్పటికీ మరుసటి రోజు ఎండలోనే ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

మండలంలోని రైతులు  పండించే పంటల్లో  ఎక్కువగా వివిధ రకాలైన మేలైన విత్తనాలు వేసినా ఆ  దిశగా నీటి తడి  లేకపోవడంతో ఎండిపోయే ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే ఆశాజనకమైన భూముల్లో రైతులు  వరి పండించేందుకు గాను ఎంటీయూ 1075, 7026- స్వర్ణ , బిపిటి 5204 సాంబ, ఎంటీయూ 1156 తరంగాణి విత్తనాలతో పాటు ఎంటీయూ 1121 శ్రీభృతి విత్తనాలు ఏపుగా వేశారు. ఈ విత్తనాలు సకాలంలో వృద్ధి చెంది పైరు ఏపుగా పెరగాలంటే పూర్తిస్థాయిలో నీరు కావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: