చారిత్రక ఘట్టం అడుగు దూరంలో ఆగిపోయింది.. భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది.. చంద్రయాన్‌—2 ప్రయోగం నిలిచిపోయింది.. లాంచ్‌ వెహికల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 19 గంటలా 4 నిమిషాల 36 సెకెన్లపాటు కౌంట్‌ డౌన్‌ కొనసాగింది.. ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల సమయంలో సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో వెంటనే అలర్ట్ కావడం కౌంట్ డౌన్ ని నిలిపివేయడం జరిగింది.  అప్పటి వరకు నింగిలోకి ఎలా దూసుకు వెళ్తుందా అని కోటి ఆశలతో చూస్తున్న జనాలు ఒక్కసారే నీరుగారిపోయారు. కాగా, "సాంకేతిక కారణాల వల్ల చంద్రయాన్—2 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నాం. మరో తేదీని తిరిగి ప్రకటిస్తాం"... ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ప్రకటన ఇది.  


ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించాల్సిన ఈ ప్రయోగం చివరి వరకు ఎంది నిలపాల్సి వచ్చిందీ అనే విషయం పై చర్చలుకొనసాగాయి.  ఆ సాంకేతిక సమస్య ఏంటి? అన్న విషయాన్ని పరిశీలిస్తే, రాకెట్ లోని క్రయోజనిక్ స్టేజ్ ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనదన్న సంగతి తెలిసిందే. ఈ క్రయోజనిక్ ఇంధనం అత్యంత కచ్చితత్వంతో వెలువడుతూ, పూర్తి గ్రౌండ్ కంట్రోల్ లో ఉండాలి.  శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు క్రయోజనిక్‌ ఇంజిన్‌ కీలకం.. అయితే, ఇక్కడే లోపాలు తలెత్తడంతో సైంటిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


పొరపాట్లు తలెత్తినా సరిదిద్దుకుని పదినిమిషాల సమయంలో లాంచ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.. అయితే, సమస్య పెద్దది కావడంతోనే ఛాన్స్‌ తీసుకోకూడదని అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్‌లోనూ ఇస్రో పోస్ట్‌ చేసింది. అంతా సవ్యంగా ఉంటే చంద్రయాన్‌-2 ప్రయోగం సక్సెస్‌ అనే మాట దేశవ్యాప్తంగా వినిపించి ఉండేది.. నిర్దేశించుకున్న సమయానికి జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ చంద్రయాన్‌-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఉండేది.. కానీ, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో చంద్రయాన్‌-2లోని అన్ని వ్యవస్థలకు తుది పరీక్షలు నిర్వహించారు.


రాకెట్ ఇంజిన్‌లో ఇంధనాన్ని నింపారు.. అయితే, క్రయోజనిక్‌ ఇంధన సరఫరాలో లోపాన్ని ముందుగానే గుర్తించిన శాస్త్రవేత్తలు.. ప్రయోగాన్ని నిలిపివేశారు. ఇక ఏ ఒక్క చిన్న సాంకేతిక సమస్యనూ తేలికగా తీసుకునే అవకాశం లేని ప్రయోగం ఇదని, అన్నీ 100 శాతం కచ్చితంగా ఉంటేనే ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి చంద్రయాన్-2 వాయిదా సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. ఇక తిరిగి ప్రయోగం చేపట్టేందుకు వారాలు పడుతుందా? లేక నెలలు పడుతుందా? అన్న విషయాన్ని చెప్పలేమని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: