జగన్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఏకంగా వీడియోల రూపంలో చూపడంతో బాబు గారు ఖంగు తిన్నారు. ఇప్పుడు కూడా ఇవాళ జరిగే అసెంబ్లీలో సమావేశంలో కూడా జగన్ వీడియోలు రూపంలో టీడీపీ ప్రభుత్వం యొక్క బడ్జెట్ గురించి నిజాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. గత బడ్జెట్ లో ఏయే పథకాలకు ఎంత కేటాయింపులు జరిగాయి, ఈ దఫా వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయని సవివరంగా గ్రాఫిక్ సాయంతో సభ్యులకు చూపించడానికి టెంప్లేట్స్ రెడీ చేయించారు.


గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారాని కూడా సభలో వివరించబోతున్నారు జగన్. ఇక టీడీపీ నేతలు గతంలో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత మారిన మాటలు.. అన్నిటికీ ఆధారాలు సేకరించుకున్నారు. మొన్న చంద్రబాబు వీడియోని అసెంబ్లీలో ప్రదర్శించి, బాబుకి ముచ్చెమటలు పట్టించిన జగన్.. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంపై వివరణ ఇచ్చే సందర్భంగా అలాంటి మరిన్ని వీడియోలు బైటపెట్టడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.


టీడీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు, అందులో జరిగిన కేటాయింపులు, వాస్తవంగా ఖర్చుచేసిన నిధులకు అంతరం ఎంత ఉందో లెక్కలు తీస్తున్నారు. అదే సమయంలో వైసీపీ బడ్జెట్ ని ఎలా పకడ్బందీగా అమలు చేస్తుందో చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబుకు మరోసారి చుక్కలు చూపించడానికి పూర్తిగా రెడీ అయ్యారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: