' పోలవరం నిర్వాసితుల క్షేమమే ముఖ్యం !!'
ఈ రోజు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పనుల పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ,పాయింట్‌ టు పాయింట్‌ మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప! గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్‌ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని ఎద్దేవా చేశారు.

కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. వైఎస్సార్‌ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. ప్రాజెక్ట్‌ వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. గత ప్రభుత్వానికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ , నిర్వాసితుల మీద లేదు. లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రాజెక్టు వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప తెదేపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి ఒక అధికారిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ చెప్పారని, నిర్వాసితులకు అండగా ఉంటామని మంత్రి అన్నారు.

గత సర్కారు ప్రాజెక్ట్‌ వ్యయం అంచనా పెంచిన తీరును అసెంబ్లీలో అనిల్‌ కుమార్‌ గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా చెబుతుంటే, సభ్యులతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ కూడా మెచ్చుకోలుగా , అభినందన పూర్వకంగా చూడటం విశేషం !!


మరింత సమాచారం తెలుసుకోండి: