క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినపుడల్లా జనం పనులు మానేసి టీవీలకు అతుక్కుపోవడం,బెట్టింగులు కాయడం పై ప్రముఖ సామాజిక విశ్లేషకుడు సిద్ధార్ధి సుభాష్‌ చంద్ర బోస్‌ ఇలా వ్యాఖ్యానించారు...

ఇంత కిరికిరి ఉన్న ఆటలో నీకు క్రికెట్టు అనేది ఒక ఆటగా ఆట ఎట్లా కనిపించిందిరా పిచ్చిసన్నాసి?

1.ఒక జట్టుమీదకు పోటీగా జట్టుని ప్రకటించడం,

2 ఫలానా అటగాడ్ని తుది జట్టులోకి తీసుకోవడం,

3.టాస్ వేయడం, ఒక్కోసారి అదే గెలుపోటములు నిర్ణయించడం,

4.మ్యాచ్ ని అడే మైదానం, దాన్లోని పిచ్ మ్యాచ్ నిర్ణయించడం,

5.టాస్ గెలిచినా ముందు బ్యాటింగా, బౌలింగా అనే నిర్ణయం మ్యాచ్ గెలుపుని నిర్ణయించడం,

6.ఐదారు మంది బౌలర్లలో ఒక్కడు, ఒక్కోసారి అతడు విసిరే ఒక్క బంతి మ్యాచ్ నిర్ణయిస్తున్నప్పుడు,

7.11మంది బ్యాట్సమన్ లలో ఒక్కడు, అతడి ఒక్కషాట్ మ్యాచ్ నిర్ణయిస్తున్నప్పుడు,

8.కోట్లమంది చూసే ఆటను ఒక్క వాతావరణ మార్పు మ్యాచ్ ఫలితం నిర్ణయించినప్పుడు,

9.22మంది ఆడే ఆటను ఒక్క ఒక నిర్ణేత తిక్క అంచనా మ్యాచ్ ఫలితం నిర్ణయించినప్పుడు,

10.లాటరిలాగా ఒకరు అవుటా కాదా అని తెలుసుకోవడం నిర్ణయమైన చోట,

11.అసలు ఆటమొత్తం ఏ బుకీ, బెట్టింగ్ రాయుడి స్క్రిప్ట్ ప్రకారమో, చివరికి డబ్బులెక్కువొచ్ఛే బోర్డ్ ప్రకారం నడుస్తున్నప్పుడు..

అందులో ప్రతిభ ఉందనీ, అది గెలుస్తోందనీ ఎందుకురా పిచ్చి సన్నాసి ఊహిస్తావు? దానికి అదనంగా ఒక బోర్డు ఆడే ఆటకి, నీ వెధవ దేశభక్తి ఎందుకు అద్దకంగా పూసుకుంటావు?

బెర్నార్డ్ షా అనే ఆయన ఎప్పుడో చెప్పేసాడు "11మంది పిచ్చివాళ్ళు ఆడుతొంటే 11వేలమంది చూస్తున్నార"ని!

పిచ్చివాడా, చూడు, ఒక కడగొట్టుజాతిగా ముద్రపడిన లేడిపిల్ల ఆ సేతు హిమాచలం మధ్య విస్తరించిన నేల తరపున, నిఖార్సుగా ఎలా గెలుస్తోందో! దీన్నిరా, గుర్తించడమంటే!


మరింత సమాచారం తెలుసుకోండి: