భారత దేశ వ్యాప్తంగా బేటీ బచావో..బేటీ పడావో అనే నినాదాలు మారుమోగుతున్నాయి. ప్రధాని ఇచ్చిన ఈ పిలుపు మేరకు దేశంలో బాలికల సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ఓ వైపు నాయకులు, అధికారులు లెక్చర్లు ఇస్తున్నా..మరోవైపు చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు.  అసలు బాలికలు ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడి మంచి హోదాలో ఉండాలని ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.  అయితే కొంత మంది తప్పదిదాల వల్ల వారి భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. 

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బాలికలకు హాస్టల్ వసతులు కల్పిన్నా అవి ఎంత వరకు సరైన క్రమంలో నడుస్తున్నాయన్న విషయం పై మాత్రం దృష్టి పెట్టడం లేదు.  హాస్టల్ లో ఎన్నో అసౌకర్యాలు ఉంటున్నాయని..సరైన భోజనం ఉండటం లేదని ఎన్నోసార్లు బాలికలు మోర పెట్టుకున్న వార్తలు చూస్తూనే ఉన్నాం.  తాజాగా ఖమ్మం ఎస్ సి హాస్టల్ లో కరెంట్ షాక్ తో ఓ విద్యార్థిని చనిపోయింది. మరో నలుగురు హాస్పత్రి పాలయ్యారు.

ఎన్ ఎస్ పీ కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్ లో రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా పొగ కమ్ముకొని, మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న యువకులు వచ్చి అమ్మాయిలను బయటకు తీసుకొచ్చారు.  ఇదే సమయంలో నాలుగో తరగతి చదువుతున్న స్పందన అనే చిన్నారి దట్టమైన పొగకు పీల్చుకోవడ తట్టుకోలేక చనిపోయింది. 

మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు..వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆ చిన్నారులు ఆసుపత్రిలో చేర్పించారు.  హాస్టల్ లో మొత్తం 35 మంది విద్యార్థినులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. హాస్టల్ లోని విద్యార్థినుల బెడ్ సీట్లన్నీ కాలిపోయాయి. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు ఎస్ సి సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసుల తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: