చంద్రబాబు అంటే చండశాసనుడు అనేవారు. టీడీపీలో బాబు మాట వేద వాక్కు. ఆయన్ని కాదనే దమ్మూ ధైర్యం ఎవరికీ లేదు. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఇలా సాగింది బాబు గారి అధికార వైభోగం. ఇపుడు అధికార వియోగంలో ఉన్నపుడు ఇంతకంటే దుర్బల నాయకత్వం చూసి ఉంటారా అనిపిస్తోంది. ఎవరికి వారే తమ్ముళ్ళు తోక జాడిస్తున్నారు. బాబుకునే డోంట్ కేర్ అనే పరిస్థితికి వచ్చేశారు. 


కేశినేని ట్విట్టర్ పురాణం చూస్తే ఆయన ఎక్కువ రోజులు పసుపు గూట్లో ఉండలేడేమోననిపిస్తోందంటున్నారు. కేశినేని గత కొన్ని రోజులుగా తన దూకుడు పెంచారు. ట్విట్టర్ వేదికగా ఆయన వీర విహారమే చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏకి పారేస్తున్నారు. ఎవరికి తగులుతోందో తెలిసి మరీ రాయి గట్టిగానే విసిరేస్తున్నారు. పొగలూ, సెగలూ పార్టీలో పుట్టించి మరీ  బయటకు పోవాలని ఆయన ఆరాటమని అంటున్నారు.


టీడీపీకి లోక్ సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇద్దరు కలిస్తే చాలు  వేరే పార్టీలోకి విలీనమే. మరి నాని వెనక ఉన్న రెండవ ఎంపీ ఎవరు, ఇపుడు అదే టీడీపీలో అతి పెద్ద చర్చగా ఉంది. నానిని కంట్రోల్ చేయడం కష్టమేనని బాబుకు కూడా అర్ధమైపోయిన వేళ ఏం చేయాలో తెలియక పెద్దాయన ఇరకాటంలో  పడుతున్నారు. మొత్తానికి నాని బాబుకు బీపీ పెంచేస్తున్నారు. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో టీడీపీలో సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: