అదేంటో ఏపీ ముక్కలు కావడంతో సీఎం పోస్ట్ మీద ఇపుడు అందరికీ చూపు పడుతోంది. మంత్రి లేదు, మరోటీ కాదు, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలి, అంతే. అంత సులువుగా ఆ సీటు దక్కుతుందని ఆశ పడుతున్నారు. చంద్రబాబు ఖాళీ చేసిన ఆ సీట్లో జగన్ కూర్చున్నారు. మరి జగన్ ముప్పయ్యేళ్ళు పాలించాలనుకుటున్నారు. 


ఇపుడు కొత్తగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ తమ్ముడు సుజనా చౌదరి కన్ను ఏకంగా సీఎం సీటు మీదనే పడిదంటున్నారు. సీఎం కావాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన పావులు  ఛురుకుగా కదుపుతున్నారని చెబుతున్నారు. ఆయనకు టీడీపీలో ఉన్న పలుకుబడి ఇపుడు పెద్ద అడ్వాంటేజ్. పైగా కమ్మ సామజిక వర్గం దన్ను మరో బలం. టీడీపీలో చంద్రబాబు వయసు మీరిన నేత కావడంతో ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఇపుడు సుజనా దిక్కు అయినా ఆశ్చర్యపోనవసరంలేదు.


సుజనా చౌదరి టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. ఆయనకు ఆ పార్టీలో గుట్లు, మట్లూ అన్నీ బాగానే తెలుసు. సరైన సమయం చూసి సుజనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే టీడీపీ గల్లంతేనని  అంటున్నారు. సుజనా ధైర్యం చూసుకునే బీజేపీ బాబు పని అయిపోయిందని చెబుతోందట. మొత్తానికి ఏపీలో బీజేపీని పటిష్టం చేసి 2024లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఇపుడు ముఖ్యమంత్రి రేసులో తొలి అభ్యర్ధిగా సుజనా దొరికేశాడు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: