భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు అని రజనీకాంత్ డైలాగు ఒకటి ఫ్యామస్. ఇపుడు ఏపీలో దాన్ని మాజీ మంత్రి ఒకరు సరిగ్గా అన్వయించేశారు. జగన్ ఒక్కసారి చెబితే ... అదీ లీడర్ కాలిబర్ అంటే అంటున్నారు. మరి జగన్ ఒక్కసారి ఏం చేప్పారు. ఏం జరిగింది.


అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ పై జరిగిన చర్చలో మాజీ మంత్రి , సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పాలుపంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో 19సార్లు కేబినెట్‌ సమావేశాలు పెట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే.. అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ అని గట్టిగా చెప్పారు. 


ఇక జగన్ నిర్ణయాలు అన్నీ అలాగే ఉన్నాయని ఆయన కీర్తించారు. మత్స్యకార గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటి?. ఎమ్మెల్యే, మంత్రులకు ఒక్క క్వార్టర్‌ కట్టలేదు. నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదు. గవర్నర్‌, స్పీకర్‌ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారు.’ అని అన్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడిగా ధర్మాన చేసిన ప్రసంగం సభలో అందరూ ఆసక్తిగా వినేలా చేసింది. ఇక టీడీపీ తమ్ముళ్లకైతే ఆ ప్రసంగం విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: