టీడీపీ నాయకులూ కేశినేని నాని, బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ఏ రేంజ్ లో తిట్టుకున్నారో మనందరం చూసాము. అయితే  సొంత పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరో సీనియర్ నేత బుద్ధా వెంకన్నలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసుకోవటం పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని బాబు ఎందుకు గుర్తించనట్లు?  మిగిలిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో పోలిస్తే చంద్రబాబు బలహీనత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.


కీలక నిర్ణయాలు తీసుకోవటంలో అదే పనిగా కన్ఫ్యూజ్ అయ్యేతీరు ఆయనకు మొదట్నించి ఉన్నదే.పార్టీలో ఇబ్బందికరంగా మారిన వారి విషయంలో చర్యలపై తేల్చుకోలేని తత్వం బాబుకు మొదట్నించి ఉన్నదే. అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెప్పక తప్పదు. కేశినేని నాని.. బుద్దా వెంకన్న ఎపిసోడ్ షురూ అయిన వెంటనే ఆదేశాలు జారీ చేసి.. ఇద్దరిని పిలిపించి ఆక్షింతలు వేసి.. కొట్టుకునే సమయం ఇది కాదురా నాయనా? అంటూ చెప్పాల్సిన చంద్రబాబు.. తనకేం సంబంధం లేనట్లుగా ఉరుకొండిపోవటంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారి పార్టీ పరువు పోయిన పరిస్థితి.


ఇలాంటి వేళ.. ఆలస్యంగా స్పందించిన బాబు తాజాగా ఇద్దరిని తనను కలవాల్సిందిగా టైమిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ బాబు మాటను కేశినేని వారు వింటారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. అంతా కాలిపోయిన తర్వాత ఫైరింజన్ వచ్చినట్లుగా.. పార్టీ పరువు మొత్తం తీసుకెళ్లి బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర కిలోల లెక్కన అమ్మేయటం పూర్తి అయ్యాక.. కళ్లు తెరిచి డ్యామేజ్ కంట్రోల్ చేయాలనుకోవటం ఏంది బాబు?  దీని వెనుకున్న లాజిక్ మీకైనా తెలుసా? 

మరింత సమాచారం తెలుసుకోండి: