టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఈ మధ్యనే బెయిల్ పై విడుదలయ్యాడు. ఒకప్పుడు టీవీ9 సీఈఓ గా పని చేసిన రవిప్రకాష్ ఆ ఛానెల్ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ చివరకు టీవీ9కు సంబధించిన లోగో రైట్స్, ఫోర్జరీ , టీవీ9 షేర్లకు సంబంధించిన కేసుల్లో దోషిగా అరెస్టయ్యాడు. ప్రస్తుతం రవిప్రకాష్ ఒక కొత్త న్యూస్ చానెల్ ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 
 
" ఆర్ ప్లస్" అనే పేరుతో తనకు బాగా పరిచయాలున్న వారితో కలిసి ఈ ఛానెల్ త్వరలోనే ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. 2024 ఎన్నికలు వచ్చే సరికి ఒక జాతీయ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రవిప్రకాష్ ఈ ఛానెల్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ చానెల్ కోసం తెరవెనుక ఇప్పటికే ప్రయత్నాలైతే ప్రారంభమయ్యాయి. 
 
కానీ తెలుగులో ఇప్పటికే లెక్కకు మించిన న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని చానెళ్ళు ఖర్చులు భరించలేక అమ్మేస్తుంటే మరికొన్ని చానెళ్ళు నష్టాలొస్తున్నా అలానే నెట్టుకొస్తున్నాయి. రవి ప్రకాష్ కు కూడా కొత్త చానెల్ ను మార్కెట్లోకి తీసుకురావటం అంత సులభమైన విషయం కాదనే సంగతి తెలుసు. మరి అన్నీ తెలిసిన రవిప్రకాష్ నిజంగా కొత్త చానెల్ పెడుతున్నాడో లేదో పెడితే ఆ చానెల్ ఇతర ఛానెళ్ళకు పోటీనిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: