అదొక నగరపాలక సంస్థ కార్యాలయం ఏ సర్కారీ కార్యాలయానికి వెళ్లినా వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు, ఫైళ్లతో హడావుడిగా ఉండే అధికారులు కనిపిస్తారు.

కానీ ఈ ఘనమైన కార్యాలయంలో అధికారులు కాగితాలతో కాదు.. మొబైల్స్‌తో బిజీగా కనిపిస్తారు. అలా అని ఏదో ఫోన్‌లో ప్రజల సమస్యలు తీర్చడం లేదు. పని పక్కన పెట్టి, టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటున్నారు.

ఆఫీసులో పని సమయంలో వీడియోలా?అని ఆశ్యర్యపోతున్నారా ? సోషల్‌ మీడియాలో నెటిజన్లు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆఫీసు విధులు మానుకుని, నలుగురైదుగురు ఒక చోటుకు చేరి వీడియోలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

కొందరు అదేపనిగా టిక్‌టాక్‌ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన ఖమ్మం జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. '' ఎన్నో పనుల కోసం వచ్చే ప్రజలకు సేవలందించాల్సిన ఉద్యోగులు ఇలా టిక్‌టాక్‌లో మునిగిపోవడం అన్యాయం...బాధ్యతా రాహిత్యం '' అని రమేష్‌బాబు, వెంకట్‌ అనే పౌరులు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటన పై వివరణ కోసం ఖమ్మం నగరపాలక సంస్థ వారిని ఫోన్‌లో సంప్రదిస్తే సమాధానం చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: