ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు  వ్యూహత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్తున్న విధానం పలువురి విమర్శకుల నోరు మూయిస్తుంది.అయితే గత పదేళ్ళుగా రాజకీయాలలో ఉంటూ జగన్ ప్రతి కుటుంబాన్ని పాదయత్రా చేసి మరీ కలిసాడు.అంతేకాకుండా ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని వారిలో నేనున్నాననే ధైర్యాన్ని నింపాడు.

పేదలకు ఇచ్చిన నమ్మకం,భరోసానే ఈ సారి ఎన్నికలలో వైసీపీనీ ఇంతటి భారీ మెజారిటీతో గెలిపించడానికి ఒక కారణం అయితే వైఎస్ ఫ్యామీలీ మాత్రం పేద ప్రజలను కానీ, నమ్ముకున్న వారిని గాని ఎప్పటికి మరిచిపోదు అని నిరూపిస్తున్నారు ఈ యంగ్ సియం. వైఎస్ బ్రతికున్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఎంత పరితపించాడో తనను బాగా దగ్గరి నుంచి చూసిన వారిని అడిగితే తెలుస్తుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా గెలిచాక కూడా తనను నమ్ముకుని ఉన్నవారికి మంచి పదవులనే కట్టబెట్టాడు.

అయితే దీనిపై కొందరు విమర్శలు చేసినా వైఎస్ అవేవి పట్టించుకోలేదు.ఇప్పుడు  జగన్,కూడా వైఎస్ బాటలోనే నడుస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తనను నమ్ముకున్న వారికి మంచి పదవులు ఇస్తూ పార్టీ కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం మరింత పనిచేయాలని చెబుతూ వస్తున్నాడు. ఇకపోతే మొదటిసారి ఏపీలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు నుండే చాలా చురుకుగా పని చేస్తున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదిశగా అడుగులు వేస్తూ ప్రజలందరిలో మంచి నాయకుడిగా పేరు సొంతం చేసుకుంటున్నాడు . తన సేవలను వినియోగించుకుంటున్న ప్రజలందరూ కూడా జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: