గతకొంత కాలం నుండి రాజకీయపార్టీల్లో ఫిరాయింపులు,వలసలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే,ఈమేరకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని వదిలి బీజేపీలో చేరబోతున్నారనే వార్త బాగానే వ్యాపించింది. అంతేకాకుండా తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పై తీవ్రమైన విమర్శలతో పాటే, పలువురు కాంగ్రెస్ నేతలపై తనదైన పద్దతిలో విరుచుకపడ్డాడు కూడా. తెలంగాణాలో తనకు కాంగ్రెస్ పార్టీ తరపున కీలకమైన పదవి ఇస్తేనే కాంగ్రెస్ లో కొనసాగుతానని, లేకపోతె కాంగ్రెస్ పార్టీని వదిలేసి,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరతానని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా అప్పట్లో హల్ చల్  సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.

కాగా కోమటిరెడ్డి సోదరుల్లో రాజగోపాలరెడ్డి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవగా, వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు.  తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్యకి టిక్కెటు దక్కించుకొని మరీ ఓటమిపాలయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆయన బిజెపిలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది.ఇక ఈ విషయం మీద స్పందించిన కోమటిరెడ్డి నిజంగానే త్వరలో బీజేపీలో చేరతారని బహిరంగంగానే ప్రకటించారుకూడా. కానీ ఈ మధ్యలోనే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సడన్‌గా మళ్లీ యూ టర్న్ తీసుకుని రెంటికిచెడ్డ రేవడిలా మిగిలాడు.

తను చేసిన వాఖ్యలవల్ల కాంగ్రేస్ అధిష్టానం గుర్రుగా వుంది.కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఉన్న‌ట్టుండి ఫ్లేటు ఫిరాయించ‌డం ప‌లువురికి అర్థం కావ‌డం లేద‌ట‌. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కీల‌క నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌గోపాల్‌రెడ్డి ఉన్న‌ట్టుండి స్వ‌రం మార్చ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని తెలుస్తోంది.

తొందరపడి నోరుజారడంవల్లే బీజేపీ త‌లుపులు మూయ‌డంతో రాజ‌గోపాల్‌రెడ్డి స్వ‌రం మార్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్నిచ్చింది కాంగ్రెస్‌. అలాంటి కాంగ్రెస్‌ను వీడ‌ను. పార్టీపై వున్న మ‌మ‌కారంతోనే అధినాయ‌క‌త్వాన్ని మంద‌లించే ప్ర‌య‌త్నం చేశానే కానీ భ‌య‌పెట్టాల‌న్న ఆలోచన నాకు లేదు అని కొమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ చెప్ప‌డం ఇత‌ర పార్టీల‌కే కాదు కాంగ్రెస్ నేత‌లకు అంతుచిక్క‌డం లేద‌ట.



మరింత సమాచారం తెలుసుకోండి: