2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుంది. వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు, కౌలు రైతులకు కూడా అక్టోబర్ 15వ తేదీనుండి 12,500 రుపాయలు పెట్టుబడి సాయం అందించబోతుంది వైసీపీ ప్రభుత్వం. రైతులకు ఉచితంగా బోర్లు వేయించబోతుంది. రైతుల శ్రేయస్సు కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయించింది. రైతులకు మేలు చేయటం కోసం ఉచిత పంటల భీమాని కూడా మొదలుపెట్టింది ప్రభుత్వం. 
 
ఈ పంటల భీమా పథకం కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు ఉన్నా లేకపోయినా మీసేవా కేంద్రాల్లోకి వెళ్ళి రుపాయి చెల్లించి భీమా పథకం కోసం నమోదు చేయించుకుంటే సరిపోతుంది. నమోదు చేయించుకున్న రైతులకు భీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కోసం వైసీపీ ప్రభుత్వం 1,163 కోట్లు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 
 
రైతుల మేలు కోసం ఏ ప్రభుత్వం చేయనంతగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతుల కోసం పగటిపూటే 9 గంటల కరెంట్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: