ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండవ సారి గెలిచిన ఆమె గతంలో మంత్రి పదవి, ఆర్టీసీ చైర్మన్ గా కూడా ఇస్తారనే గూసగుసలు వినిపించాయి. ఆమెకు ఎలాంటి పదవి అప్పగించకపోవడంతో అలకబూనటంపై ఆమె స్పందించారు. చివరకు ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం ఏపీఐఐసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే ఆర్కే రోజా బాధ్యతలు స్వీకరించిన ఆమె విలెకరులతో మాట్లాడుతూ ఈ పదవిని తనకు అప్పగించనందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారని, బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళాల పక్షపాతి అని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అర్థమౌతుందన్నారు. ప్రస్తుతం నవరత్నాలను అమలు చేసే విషయంలో కృషి చేస్తున్నారన్నారు.

ఇంకా కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. పారిశ్రామికీకరణకు బడ్జెట్‌లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పారదర్వకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుంది.’ అని రోజా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: