ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో తొలిసారిగా అధికారం సాధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసమే విదేశాలకు వెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. నేను చేసిన కృషి వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఉపాధి కల్పనకు పని చేశామన్నారు.

తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, అందుకే ఆంధ్ర రాష్ర్టంలో 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చంద్రబాబు వెల్లడించారు. 39 కోట్లు దుర్వినియోగం చేశారని సభలో విమర్శించడం సరికాదని సభలో చంద్రబాబు పేర్కొన్నారు. తనను విమర్శించేముందు రాష్ట్రాభివృద్ధి కోసం మీరేం చేస్తారో చెప్పండని అధికార పక్షాన్ని నిలదీశారు.

ఈ రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించేందుకే రేయింబవళ్లు తిరిగినందున రాష్ర్టానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానానికి వచ్చామన్నారు. కియా మోటార్‌ను తీసుకొచ్చామన్నారు. నాపై బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. అలా కదాని నన్ను విమర్శించే ముందు మీ సంగతి చూసుకోండి... దుర్వినియోగంపై నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు సభలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: