ఒకప్పుడు వ్యాపారులు పోటీ పడి మరీ మద్యం దుకాణాలను దక్కించుకొనేవారు. ఒక్క వైన్ షాపును దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. మద్యం వ్యాపారులు మెల్లగా ఈ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నారు. ఒక్క దుకాణం చాలు అనుకున్నవారు నేడు వాటి జోలికిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం తీసుకున్న నూతన ఎక్సైజ్ విధానమే కారణం అని పలువురు అంటున్నారు. భవిష్యత్ లో స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాలను పరిమితం చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో ఇప్పటి నుంచే తప్పుకోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.

అందుకే మద్యం షాపుల రెన్యువల్ కు ఎవరు ముందుకు రావడం లేదు. ఒక పక్క బెల్టు షాపుల ఎత్తివేత..మరో పక్క తగ్గిన వ్యాపారంతో నష్టాల వెరిసి జిల్లాలో మద్యం కిక్ తద్దినానట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో 44 షాప్లకు సంబంధించి మద్యం విడిపించడం మానేశారు. వాస్తవానికి మద్యం దుఖాణాలు లైసెన్స్ గడువు గత నెలతోనే ముగిసింది. కొత్త  ఎక్సేంజ్ పాలసీ ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న షాపులకే మూడు నెలల వరకు లైసెన్స్ రెన్యువల్ అవకాశం కల్పించింది.

జిల్లాలో 237 పైన వైన్ షాపులు ,17 బార్లు ఉన్నాయి. వీటన్నింటికి ఎచ్చెర్లలోని బాట్లింగ్ యూనిట్ ద్వారానే మద్యం, బీర్ కేసులు లిఫ్టింగ్ జరుగుతోంది. ప్రతీ నెల సుమారు రూ.90 కోట్ల మేర సరుకు లిఫ్టింగ్ అవుతుంది. గతంలో రోజుకు పది నుంచి పెన్నెండు వేల లిక్కర్, బీర్ కేసులు లిఫ్టింగ్ జరుగుతుండేది. ప్రస్తుతం ఏడెనిమిది వేల కేసులు మాత్రమే లిఫ్టింగ్ జరుగుతోంది. ఈ లెక్కన సుమారు నాలుగువేల కేసులు లిఫ్టింగ్ తగ్గినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: