జిల్లాకే వెన్నుముక్కగా  ఉన్న రిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు వైద్యులు , సిబ్బంది లేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అసలే తగినంత మంది వైద్య సిబ్బంది లేక పోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతుంది . తాజాగా ప్రాధాన్య విభాగాల్లోని కొందరు వైద్యులు బదిలీ కోరుకొని వెళ్లిపోగా.. వారి స్థానంలో ఇప్పటికీ వచ్చే వారు కరువైయ్యారు. దీంతో సాధారణ  సేవలతో  పాటు శస్త్ర చికిత్సలకు  ఆటంకం  కలుగుతుంది. 750 పడకలు,  వైద్య కళాశాలతో కూడిన ఈ ఆసుపత్రిలో సుమారు 160 వైద్యులు ఉండాలి .

అయితే 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వం సాధారణ బదిలీలకు అవకాశం కల్పించడంతో రిమ్స్ లో పని చేస్తున్న వైద్యుల్లో సుమారు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16 మంది బదిలీపై వెళ్లిపోయారు. (ఈ ఎన్ టీ) ప్రొఫేసర్  ప్రదీప్, జనరల్ మెడిసిన్ ప్రొఫేసర్ ప్రసాద్, ఎర్థోపెడిక్ ప్రొఫేసర్ కిషోర్ ఇలా.. 16 మంది ప్రొఫేసర్లు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు కేవలం ఎమిమిది మంది మాత్రమే. వారు ఇంకా విధుల్లోకి చేరుతారో లేదో.. సందిగ్ధమే. సుమారూ ఐదేళ్లుగా ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రికి వైద్యుల కొరత వేధిస్తూనే ఉంది. ప్రస్తుత పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది.

వైద్యుల కొరత కారణంగా అవుట్ పేషేంట్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది . గతంలో రోజుకు 1600 ఓపిలు నమోదయ్యేవి. ఇప్పుడు 900 నుంచి 1200 వరకు ఓపిలు నమోదవుతున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రికి  క్లిష్టమైన  కేసులన్నీ వస్తాయి. ప్రధానంగా రోడ్ ప్రమాదాల్లో తీవ్ర గాయలుపడిన క్షతగాత్రులను ముందుగా ఇక్కడికే తీసుకొస్తారు. కానీ సిబ్బంది కొరత కారణంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: