కర్ణాటకలో రాజకీయాలు గంటగంటకు మారిపోతున్నాయి.  ఏ నేతలు ఎటువైపు ఉంటారో అర్ధంగాక తలలు పీక్కుంటున్నారు.  పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో.. కుమారస్వామి సర్కారు అయోమయంలో పడింది.  ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.  


గురువారం రోజున కుమారస్వామి బలపరీక్షను నిరూపించుకోబోతున్నారు. తప్పకుండా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోపల తెలియని భయం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఈ మధ్యాహ్నం నుంచి వస్తున్న వార్తల ప్రకారం.. కుమార స్వామి చాలా ఖుషీగా ఉన్నారట. 


కారణం ఏంటి అంటే.. ఎలాగో ప్రభుత్వం కూలిపోతుంది.  టెన్షన్ పడటం ఎందుకు అనే ధోరణిలో కుమారస్వామి ఉన్నారని తెలుస్తోంది. జేడీఎస్ కు చెందిన నేతలు రాజీనామా చేసింది లేదు.  ఒకరో ఇద్దరో ఉన్నారు.  కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువమంది ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు.  


గురువారం రోజు కోసం బీజేపీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.  ఉదయం 11 గంటల వరకు బలనిరూపణపై చర్చ జరుగుతుంది.  ఉదయం 11 తరువాత బాల నిరూపణకు సంబంధించిన కార్యక్రమం ఉంటుంది.  ఒకవేళ బలనిరూపణలో కుమారస్వామి ఓడిపోతే.. బీజేపీ గద్దెనెక్కుతుంది.  దీంతో సంకీర్ణ సర్కారుకు తెరపడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: