వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమిపై భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. 7వ బ్యాట్స్‌మెన్‌గా ధోనీని పంపడం వ్యూహాత్మక తప్పిదం అని టీమిండియా మాజీ క్రికెటర్స్ లక్ష్మణ్, గంగూలీ అభిప్రాయపడ్డారు. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఊహించని వాదన తెరపైకి తెచ్చారు.


టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన అంతర్గత రాజకీయాల వల్ల అంబటి రాయుడు వరల్డ్ కప్‌కు, జట్టుకూ దూరమయ్యాడని, రాయుడు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాదిస్తున్నారు. న్యూజిలాండ్‌పై రాయుడుకు మంచి రికార్డ్ ఉందని చెప్పుకొస్తున్నారు.


న్యూజిలాండ్‌పై ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంటే అంబటి రాయుడు 113 బంతుల్లో 90 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడని.. అలాంటి వ్యక్తిని వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెమీస్‌లో టీమిండియా ఓటమికి ఇదే బలమైన కారణమని వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: