తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి అధికార టీఆర్ఎస్ పార్టీ  నేతలు చిక్కుతున్నారా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . టిఆర్ఎస్కు  ఇటీవల మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుడ్ బై చెప్పేసి కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే.  అదే దారిలో ఇప్పుడు  మరో మాజీ మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు  రెడీ అవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  సొంత జిల్లాలోని వర్గపోరు కారణంగానే సదరు మాజీ మంత్రి బిజెపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


ఉమ్మడి  పాలమూరు జిల్లాలో  జిల్లా పరిషత్ సీఈఓ ల నియామకంలో ఒక మంత్రి వ్యవహారశైలి ని జీర్ణించుకోలేని   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది . గద్వాల సీఈఓ గా స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించిన వ్యక్తిని కాదని తొలుత  మరొక వ్యక్తిని నియమించడం జరిగింది . దీనితో  అలిగి  ఆయన  తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపారు .కృష్ణమోహన్ రెడ్డి  గత ప్రభుత్వం లో మంత్రిగా పనిచేసిన జూపల్లి వర్గీయుడిగా ముద్రపడ్డారు .


 జూపల్లి ని టార్గెట్ చేసిన సదరు మంత్రి , జెడ్పి సీఈఓ ల నియామకం లో కృష్ణమోహన్ రెడ్డి సూచించిన వారిని కాదని మరొకర్ని గద్వాల జిల్లా సీఈఓ గా నియమించడం లో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది . అంతటితో ఆగని సదరు మంత్రి జూపల్లి , కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రోత్సహిస్తున్నారని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు . జిల్లా లో ఇంత జరుగుతున్న పార్టీ నాయకత్వం ఏమి పట్టనట్టు ఉండడం తో  కలత చెందిన జూపల్లి … బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: