రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరవేయడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే డా.బాచిన చెంచు గరటయ్య కార్యకర్తలకు సూచించారు. మండలంలోని పుట్టావారిపాలెంలో  నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీల అమలుకు తొలి బడ్జెట్ లోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. 

ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోపే  పాలనలొ పెను మార్పులు తీసుకురావడంతో  పాటు అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని  అన్నారు. గ్రామంలో చిన్నపెద్ద విభేదాలు లేకుండా నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని మండల వైసీపీ అధ్యక్షుడు అట్లా పెద వెంకటరెడ్డి, ఓరుగంటి కోటిరెడ్డి అధికారులకు సూచించారు.
వైఎస్సార్ పార్టీ అభివృద్ధికి , ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే అడ్డంకి, వైసీపీ ఇంచార్జి బాచిన అన్నారు.

వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గరటయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించే పథకాలలో కార్యకర్తలకే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ కోసం  కష్టపడిన వారిని దృష్టిలో ఉంచుకొని వాలంటీర్లు పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: