హైదరాబాద్: తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపి బలపడిందని, అదికార పార్టీకి రోజులు దగ్గరపడ్డట్టేనని బీజేపి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 
సీఎం చంద్రశేఖర్ రావు రోజులు లెక్కపెట్టుకోవాల్సిన అవసరం ఉందని, చాపకింద నీరులా బీజేపి రాష్ట్రమంతా విస్తరిస్తోందని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ చెప్పుకొస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు కూడా తనదైన శైలిలో గులాబీ పార్టీ పై విరుచుకు పడ్డారు. 
టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందా అనే అనుమానం కలుగుతోందని, ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని అన్నారు. తహశీల్దార్ లావణ్య కేసే ఇందుకు పెద్ద ఉదాహరణ అని బీజేపి అభివర్ణిస్తోంది. అనేక శాఖలపై ఆరోపణలు వచ్చినా, విచారణ ఎందుకు చేయడం లేదని బీజేపి సూటిగా ప్రశ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: