అధికార వైకాపా వైకాపా పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు బిజెపి వైపు చూస్తున్నట్లు  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులు పక్క పార్టీల వైపు చూడడం సహజమే ...  కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా  నాయకురాలు బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడం  హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజక వర్గం నుంచి  వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తోట వాణి ,  బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


 టీడీపీ నుంచి, ఇటీవల  బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా ఆమె బీజేపీలోకి చేరడానికి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తోట వాణి భర్త నర్సింహం గతంలో టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెల్సిందే . సుజానాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వాలని తోట వాణి భర్త నర్సింహం కోరగా , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు . దాంతో, తోట దంపతులు వైకాపా తీర్ధాన్ని పుచ్చుకున్నారు . అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తోట వాణి, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఓటమి ఓటమిపాలయింది .


వైకాపా అధికారం లో వచ్చినప్పటికీ , తాను ఓటమిపాలు కావడంతో , రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్న ఆమె , సుజనా ద్వారా బీజేపీ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .   ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట వాని ఒకవేళ వైకాపాను వీడి బీజేపీ లో  చేరితే ఆ నియోజకవర్గంలో వైకాపాకు గట్టి  ఎదురుదెబ్బ తగిలినట్లేనని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: