వైఎస్ జగన్ నిర్ణయాలు ఎపుడూ సంచలనంగా ఉంటాయి. ఆయనది రొటీన్ బాట కాదు, ప్రజల అభిమానంతో అధికారంలోకి వచ్చిన వారి ఆలోచనలు కూడా దూకుడుగా ఉంటాయి. దానికి జగన్ అక్షరాలా నిరూపిస్తున్నారు. ఏపీలో ఇపుడు మరో కీలక‌మైన సమస్య మావోయిస్టులు. వారి విషయంలో జగన్ పాజిటివ్ స్టెప్ తీసుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాజాగా మావోయిస్టుల విషయంలో డేరింగ్ డెసిషన్ తీసుకుందనే చెప్పాలి.  వారి సమస్యలపై ఏపీ ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్నయాలు తీసుకోనుంది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర విషయాలపై కమిటీ చర్చించనుంది.


మావోయిస్టుల నియంత్రణ వారి సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని తెలిపింది. ఈ కమిటీకి చైర్మన్ గా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటారు. కమిటీలో సభ్యులుగా హోంమంత్రి- గిరిజన- రెవెన్యూ- ఆర్ అండ్ బీ మంత్రులకు చోటు కల్పించారు. ఇదిలా ఉండగా మావోయిస్టులు ప్రాబలం అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతలో వైసీపీ నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకుంది. ఆ మాటకు వస్తే జగన్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని గత టీడీపీ సర్కార్ హయాంలో హత్య చేసి కొంత అలజడి స్రుష్టించారు.


ఇక మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలని గతంలోనే మావోలు డిమాండ్ చేశారు. ఇపుడు జగన్ బాక్సైట్ జీవోను రద్దు చేసి  మావోల కీలక డిమాండ్ నెరవేర్చారు. దాంతో రానున్న రోజుల్లో మావోల సమస్యను సానుకూలంగా, శాశ్వతంగా పరిష్కరించాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా అర్ధమవుతోంది. చూడాలి మరి పర్యవసానాలు ఎలా ఉంటాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: