భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో, సాంకేతిక సమస్యల ఏర్పడటంతో ప్రయోగం వాయిదా పడింది. క్రయోజనిక్‌ స్టేజ్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, సిద్దార్ధి సుభాష్‌ చంద్రబోస్‌, తన దైన శైలిలో ఇలా స్పందించారు.
మనదేశంలో చంద్రుడు ఒక గ్రహం [పిల్లలూ, మీ సైన్సు పుస్తకాల్లో అదొక గ్రహం (planet)గా గాక ఉపగ్రహం (satellite) అని రాస్తే వాటిని దాచేయండి],
అతడొక కేంద్రంగా జ్యోతిష్యం అనే "సైన్సు"ని కోర్సుగా విశ్వవిద్యాలయాలు బోధిస్తున్నాయిక్కడ. జాతకాలపేరుతో రంగుర్రాళ్లనుండి, రత్నాలు, వాస్తులు, పుస్తకాలు పత్రికలు, టీవీల్లో రాశిచక్రాలు ప్రకటిస్తున్నాయి.

 రోజూ ఘడియలు, ముహుర్తాలు, పూజలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, అమ్మకాలు,కొనుగోళ్లు, పేర్లు పెట్టుకోవడాలు.. అబ్బా ఉదయం తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడని నమ్మడం నుండి రాత్రి ఏవైపున తలపెట్టి పడుకోవాలో నిర్ణయించుకోవడం నుండి ఏ నక్షత్రంలో పుడుతున్నామో తెలియడం నుండి చచ్చాక తద్దినం నిర్ణయించుకునేదాకా ఆధారపడే ఒక గృహం మీద మనిషి ప్రయోగాలు చేయడం ఎంత దుస్సాహసం?

తరాలతరబడి వీటిని ప్రచారం చేసుకుని పూజలు చేసే పవిత్రకులవృత్తిని ఎలా అవమానిస్తారు? వారి జీవనోపాధి ఏమవ్వాలి? మిగతాకులాలు దేన్ని నమ్ముకుని జీవించాలి? చంద్రుడు ఒక దేవుడు. అమృతం చిలికినప్పుడు ఉద్భవించినవాడు, అతడు శివుని కిరీటాన్నే ఎక్కిన గొప్పవాడు, లక్ష్మిదేవికి సోదరుడు, విష్ణువుకి బావమరిది..

అతడులేని పురాణం ఉందా, కావ్యం ఉందా? అట్టి దేవుడిమీద పరీక్షలా? ఠాట్, వీల్లేదు, ఇవన్నీ హేతువాదుల కుట్రలు, విదేశీవిద్యలోని పైత్యాలు, మా మతమ్మీద దాడులు.. అని చందయానాన్ని నిలిపేయలేదుకదా! జస్ట్, డౌటనుమానం.



మరింత సమాచారం తెలుసుకోండి: