ఏపీలో కొత్త ప్రభుత్వం జగన్ సీఎంగా ఏర్పడింది. అయితే కొత్త ప్రభుత్వం ఇప్పటికే పెద్ద కంపెనీలను రప్పించడంలో విజయవంతం అయ్యిందని చెప్పాలి. ఎందుకంటారేమో తాజాగా మరో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దేశీ అతిపెద్ద ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎన్‌టీపీసీ కొత్తగా పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. న్‌టీపీసీ విశాఖపట్నం (సింహాద్రి) వద్ద 25 మెగావాట్ల సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (ఎస్‌పీవీ) విద్యుత్‌ ప్లాంటు నెలకొల్పనుంది.


దీనికి సంబంధించి ఎన్‌టీపీసీ నుంచి రూ.100 కోట్ల ఆర్డరు లభించిందని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ భెల్‌ తెలిపింది. ఎన్‌టీపీసీకి సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు నీటి రిజర్వాయర్‌పై ఈ సౌర విద్యుత్‌ ప్లాంటు నెలకొల్పుతామని భెల్ వెల్లడించింది. ‘ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో 25 మెగావాట్ల ఎస్‌పీవీ విద్యుత్‌ ప్లాంట్‌ను సింహాద్రి వద్ద ఏర్పాటు చేసేందుకు ఆర్డర్‌ లభించింది.


గతంలో తెలంగాణలోని రామగుండం వద్ద 100 మెగావాట్ల ఎస్‌పీవీ ప్లాంటును నిర్మించాం’ అని భెల్‌ పేర్కొంది. ఇకపోతే దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2,500 కోట్లు. కంపెనీ కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామం సమీపంలో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచంలోని ఐదో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ పోస్కో కూడా ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: