కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది.కేంద్రం మహిళల సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని "పీఎం స్కూటీ యోజన" పేరుతో అమలులోకి తెచ్చింది. పదవ తరగతి తరువాత ఉన్నత చదువులు చదివే బాలికలకు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవారికి ఉచితంగా స్కూటీలు అందజేయబోతున్నారు. ఈ పథకానికి పదవ తరగతి మార్క్స్ మెమో, ఇన్ కమ్ సర్టిఫికెట్,రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళు అర్హులు.

 

18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులని, ఆదాయం రెండున్నరలక్షలకంటే తక్కువగా ఉండాలని, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని గత కొన్ని రోజులుగా సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అసలు నిజం ఏమిటి అంటే ఇలాంటి పథకం ఏదీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈ పథకం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు.

 

నిజానికి ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం 50% సబ్సిడీతో స్కూటీలు అందజేస్తున్నారు. అంతే తప్ప కేంద్రం ఇటువంటి పథకాన్ని మాత్రం అమలు చేయట్లేదు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈ పథకం "అమ్మ స్కూటర్ యోజన" పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ ఫోటోల్నిఉపయోగిస్తూ కేంద్రం ఈ పథకాన్నిఅమలు చేస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఈ పథకం అమలులో ఉన్న మాట వాస్తవమే కానీ కేంద్రం ఇలాంటి పథకం అమలు చేస్తోందన్న వార్త మాత్రం పూర్తిగా అవాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: