Photo Feature...
అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పడిపోకుండా, ాపాడుతున్నాయేమో అన్పిస్తోంది కదూ, ఇదొక ఇంజనీరింగ్‌ వండర్‌. మరి ఆ వంతెన మీద మనం కూడా విహరించాలంటే, వియత్నాం వెళ్లితీరాలి. 'గోల్డెన్‌ హ్యాండ్స్‌' అనే ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో కట్టారు.

వియత్నాంలోని బనా హిల్స్‌ రిసార్ట్‌ వద్ద ఉన్న ఈ వంతెనకు ఇరు పక్కలా, లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. ఈ అద్భుతాన్ని చూడటానికి, ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ వంతెన ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.
ఈ వంతెనపైనుండి చూస్తే ఆకాశంలోని మేఘాలు చేతికి తాకినట్టు అన్పిస్తోంది అంటున్నారు పర్యాటకులు. ఈ అర చేతుల్లో అద్భుతాన్ని వీలైతే మీరూ ఒక సారి వెళ్లి చూడండి!!


మరింత సమాచారం తెలుసుకోండి: