నమ్మినవాళ్లకు న్యాయం చేస్తాడని సిఎం జగన్ కు పేరు. దాన్ని నిజం చేస్తూ జగన్ సీఎం అయ్యాక పలువురికి కీలక పదవులు ఇస్తూ న్యాయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో సినీ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ జగన్ గెలుపు కోసం కష్టపడ్డారు. మెగా హీరోలను కూడా టార్గెట్ చేశారు. ఇది గుర్తించిన జగన్ సినీ నటుడు పృథ్వీకి శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్ పదవిని కట్టబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఆయన సీఎంను, అజయ్ కల్లాం ను కలవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది.

 

ఇప్పుడు జగన్ దృష్టి మరో కమెడియన్ కం హీరో ఆలీపై పడిందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఎన్నికల ముందు వరకు ఆలీ ఏ పార్టీలో చేరాలో కన్ఫ్యూషన్ లో ఉండిపోయాడు. ఒక దశలో.. మంత్రి పదవి ఇచ్చేవారి పార్టీలో చేరతాను అని కూడా అనేశాడు. మొత్తానికి వైసీపీలో చేరి జగన్ కు సపోర్ట్ చేశాడు. వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం అయిపోవడం జరిగిపోయాయి. సినిమా వ్యక్తులకు సంబంధించి మొదట పృథ్వీతో మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు ఆలీకి న్యాయం చేయాలని చూస్తున్నాడట. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతోపాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కూడా కట్టబెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే నిజమైతే జగన్ తను నమ్మిన వారికి న్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే వైసీపీకి మొదటి నుంచి సీనీ ఇండస్ట్రీ అనుకూలంగానే ఉంది. ఆలీకి కీలక పదవి కట్టబెట్టడం ద్వారా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నట్టే. సినిమా వ్యక్తులు కాబట్టి ప్రజల్లోకి త్వరగా వెళతారు. కాబట్టి ఇటువంటి కీలక పదవి ఆలీకి ఇవ్వడం జగన్ కు లాభించేదే. ఆలీ తర్వాత ఇండస్ట్రీ నుంచి మరెవరు జగన్ నుంచి పదవులు పొందుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: