ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు ప్రజల శ్రేయస్సు కోసం విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎక్కువ ధరలతో ఒప్పందం చేసుకుంది. ఇలా ఎక్కువ ధరలకు ఒప్పందం చేసుకోవటం వలన ప్రభుత్వంపై భారం పడుతుంది. ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది. 
 
తక్కువ ధరలకే థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నా సౌర, పవన్ విద్యుత్ ఎక్కువ ధరలకు కొనుగోలు చేసారని, దేశంలో అన్ని చోట్ల పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయని కానీ రాష్ట్రంలో మాత్రం ఈ ధరలు పెరిగాయని అజేయ్ కల్లం అన్నారు. రాష్ట్రంలో అవినీతి జగరకుండా చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డిగారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షిస్తున్నారని అజేయ్ కల్లం తెలిపారు. 
 
ప్రైవేట్ విద్యుత్ ఎక్కువ ధరలకు కొనుగోలు చేయటం వలన విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు అప్పులు పెరుగుతున్నాయి. ఇలా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 2500 కోట్ల రుపాయల భారం పడుతుంది. విద్యుత్ ధరలు తగ్గితే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపుతారని లేదంటే పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారని అజేయ్ కల్లం అన్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: