కేశినేని నాని ట్విట్ వార్ రోజు రోజుకు పెద్దది అవుతుంది తప్ప తగ్గడం లేదు. ఎన్నికల తర్వాత నుంచి మొదలు పెట్టిన కేశినేని నాని సోషల్ మీడియా వార్ ఆదివారంతో ట్విట్ వార్ గా మారింది. ట్విట్టర్ వేధికగా కేశినేని నాని, బుద్ధా వెంకన్న ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు అవమానించుకుంటూ పార్టీ పరువుని తీశారని నెటిజన్లు ఫైర్ అయ్యారు.  


ఆదివారం ఉదయం కేశినేని నాని నాలుగు పదాలు రానివాడు కూడా ట్విట్ చేస్తున్నాడు, దౌర్బాగ్యం అని ట్విట్ చేసాడు. ఈ ట్విట్ కు స్పందించిన బుద్దా వెంకన్న సంక్షోభంలో ఉన్న పార్టీకి అండగా ఉండాలి కానీ అంటూ ట్విట్ వార్ మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు ట్విట్లు చేసుకుంటూ, వాళ్ళని వల్లే తక్కువ చేసుకుంటూ నెటిజన్ల ముందు నిజాలు చెప్పేసారు. 


ఇందుకు సంబంధించి ఇద్దరికీ అధిష్టానం నుంచి ట్విట్ వార్ ఆపాలంటూ  ఆదేశాలు రావడంతో బుద్ధ వెంకన్న అధిష్టానం కోసమే ఈ ట్విట్ వార్ ఆపుతున్నాను అంటూ ట్విట్ చేసాడు. కానీ ప్రారభించినా వారు మాత్రం ఈ ట్విట్ వార్ ఆపడం లేదు, పదవికి రాజీనామా చెయ్యడానికి కూడా సిద్ధం అంటూ నిన్న ట్విట్ చేశారు. ఈరోజు బాలయోగి ఆస్తులు తాను కాజేశానని ఓ ప్రబుద్ధుడు చెప్పాడని మళ్ళి ట్విట్ వార్ మొదలు పెట్టారు. ఈ ట్విట్ వార్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: