ప్రజాస్వామ్యంలో ఎవరైన పోరాటాలు చేసుకునే అవకాశం, హక్కు ఉంటాయి. తమకు నచ్చని దాని మీద జనాల్లోకి వెళ్ళొచ్చు. అలాగే, తమ డిమాండ్ల మీద కూడా ధర్నాలు, ఆందోళను చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మరి అలాంటి అవకాశాలు పాలకులు లేకుండా చేస్తే...


ముఖ్యమంత్రి జగన్ తనకు పొరాటాలు చేసే చాన్సే లేకుండా చేశారని బీసీ సంఘం నేత ఆర్ క్రిష్ణయ్య అంటున్నారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్‌ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయిందని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. జగన్ బీసీ పక్షపాతిగా నిరూపించుకున్నారని క్రిష్ణయ్య కొనియాడారు.


దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టించారని అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌.కృష్ణయ్య ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు.


కేంద్రం ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు అంటూ క్రిష్ణయ్య కితాబులు ఇచ్చారు. ఓ విధంగా జగన్ తనకు ఏపీలో బీసీల కోసం పోరాటం చేసే అవకాశం లేకుండా చేశారని క్రిష్ణయ్య కీర్తించారు. నిజంగా ఇది గ్రేటే కదూ...


మరింత సమాచారం తెలుసుకోండి: